తిరుమల మెట్లెక్కుతూ విద్యార్థిని మృతి

తిరుమల వెంకన్న దర్శనానికి కుటుంబీకులతో సంతోషంగా వెళ్లిన ఓ విద్యార్థిని మెట్ల దారిలో ఆకస్మికంగా మృతి చెందారు.

Published : 03 Jun 2023 05:12 IST

గోరంట్ల, తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల వెంకన్న దర్శనానికి కుటుంబీకులతో సంతోషంగా వెళ్లిన ఓ విద్యార్థిని మెట్ల దారిలో ఆకస్మికంగా మృతి చెందారు. బాధితుల కథనం ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల రెడ్డివారి వీధికి చెందిన నరసిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుటుంబీకులు, బంధువులు కలిసి ప్రత్యేక వాహనంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుమల దర్శనానికి బయలుదేరారు. ఉదయం మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళుతుండగా రెండో కుమార్తె దివ్య (18) వేగంగా మెట్లెక్కి వెంటనే శీతలపానీయం తాగారు. దీంతో గుండె పట్టేసినట్లయి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. దివ్య ఇంటర్‌ పూర్తిచేసి ఇంజినీరింగ్‌లో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారని బంధువులు తెలిపారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు