దుప్పట్లో మూట కట్టి... ఇంటి ముందు మృతదేహాన్ని పడేసి...
మృతదేహాన్ని దుప్పట్లో మూట కట్టి తీసుకొచ్చి ఇంటి ఎదుట రోడ్డుపై పడేసిన ఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకులలో ఘటన
పుల్లలచెరువు, న్యూస్‌టుడే : మృతదేహాన్ని దుప్పట్లో మూట కట్టి తీసుకొచ్చి ఇంటి ఎదుట రోడ్డుపై పడేసిన ఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు లింగాలు కుమారుడు ఉప్పు శ్రీను (35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పనులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తల్లికి ఫోన్ చేసి రెండు రోజుల్లో చేసిన పనికి డబ్బులు వస్తాయని, అవి రాగానే ఇంటి వస్తానని చెప్పారు. కన్న కొడుకు ఇంటికి వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా.. గురువారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓ దుప్పటి మూటను వారి ఇంటి ముందు రోడ్డు పడేసి వెళ్లిపోయారు. కారు శబ్దం విన్న చుట్టుపక్కల వారు, తండ్రి లింగాలు లేచి మూట తెరిచి చూడగా అందులో శ్రీను మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కన కవర్‌లో రూ.35,000 నగదు, ఒక లేఖ ఉన్నాయి. అది చూసి వెంటనే వీఆర్వో, పుల్లలచెరువు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మాకు ఎలాంటి సంబంధం లేదు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోయారు. అందుకే మృతదేహం ఇంటి వద్ద వేసి వెళ్తున్నాం...’ అని రాసి ఉందని ఎస్సై శ్రీహరి తెలిపారు. ఇతను ఎలా మరణించాడు, మృతదేహాన్ని ఎవరు ఇక్కడ పడేశారు అనే దిశగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్య పుట్టింట్లో ఉంటున్నారని గ్రామస్థులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్