ప్రశ్నపత్రాల కేసులో డీఈఈ రమేష్‌కు ఆరు రోజుల కస్టడీ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన డీఈఈ రమేష్‌ను 6 రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం శనివారం అనుమతి ఇచ్చింది.

Updated : 04 Jun 2023 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన డీఈఈ రమేష్‌ను 6 రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం శనివారం అనుమతి ఇచ్చింది. నగర సిట్‌ పోలీసులు ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకొని వాంగ్మూలం సేకరించనున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ నుంచి సురేష్‌ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు తీసుకున్నాడు. వాటిని డీఈఈ రమేష్‌ ద్వారా 30 మందికిపైగా విక్రయించి వాటాలు పంచుకున్నారు. రమేష్‌ గతంలో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌తో ఏఈఈ, డీఏవో పరీక్ష రాసిన ఏడుగురు అభ్యర్థులకు సహకరించినట్లు నగర సిట్‌ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కావటంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని