America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ (25) అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
భీమ్‌గల్, న్యూస్‌టుడే: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ (25) అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శైలేష్ బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు సెప్టెంబరులో అమెరికాకు వెళ్లారు. శనివారం తన కారులో వెళ్తుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వేగంగా వచ్చిన కారు.. నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, శైలేష్ సజీవ దహనమయ్యారు. మృతుడి తండ్రి సత్యం గల్ఫ్ దేశం వెళ్లి తిరిగి వచ్చారు. తల్లి గృహిణి. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నత చదువులు చదువుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’