Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్లోని గదిలో దంత వైద్య విద్యార్థిని మంటల్లో ఆహుతి అవుతూ కనిపించిన సంఘటన వెలుగు చూసింది.
రక్షించే ప్రయత్నాలు విఫలం
ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్లోని గదిలో దంత వైద్య విద్యార్థిని మంటల్లో ఆహుతి అవుతూ కనిపించిన సంఘటన వెలుగు చూసింది. రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక.. ఆమె మృతి చెందింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమెది ఆత్మహత్య కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఖానాపురం హవేలి సీఐ శ్రీహరి కథనం ప్రకారం... వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేటు వసతిగృహం నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం కాలిపోయిన వాసన వస్తుండటంతో నిర్వాహకులు, ఇతర విద్యార్థినులు వచ్చి చూశారు. ఆమె గది నుంచి పొగలు వస్తుండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
సంఘటనకు ముందు మానస గది నుంచి కేకలు వినిపించాయని కొందరు చెబుతున్నారు. హాస్టల్ సమీపంలోని ఓ బంకు నుంచి ఆమె పెట్రోలు కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇటీవలే తండ్రి మృతి చెందడంతో మనస్తాపం చెందిన మానస.. తరచూ ఆయనను తలచుకుని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా ఆమె తోటి విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, మృతురాలి బంధువులు వరంగల్ నుంచి రావాల్సి ఉందని సీఐ తెలిపారు. ఆమెది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, గదిలో ఎటువంటి లేఖ దొరకలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన