శోభనం గదిలోకి పంపితే.. శవాలుగా మిగిలారు

కొత్తజీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న నవ యువజంటను ఆ రోజు రాత్రి శోభనం గదిలోకి పంపారు. మరుసటిరోజు ఉదయాన్నే గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ విగతజీవులుగా మంచంపై పడున్నారు. దీంతో ఇద్దరి కుటుంబాలు ఘొల్లుమన్నాయి.

Updated : 05 Jun 2023 06:16 IST

ఒకే చితిపై నవ దంపతుల అంత్యక్రియలు

త్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్‌ యాదవ్‌కు 20 ఏళ్ల పుష్పతో మే 30న (మంగళవారం) పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. కొత్తజీవితంపై ఎన్నో ఆశలతో ఉన్న ఈ నవ యువజంటను ఆ రోజు రాత్రి శోభనం గదిలోకి పంపారు. మరుసటిరోజు ఉదయాన్నే గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ విగతజీవులుగా మంచంపై పడున్నారు. ఇద్దరి కుటుంబాలు ఘొల్లుమన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ.. నవ దంపతులు ఇద్దరూ గుండెపోటుతో మృతిచెందినట్లుగా వైద్య నివేదికల్లో తేలిందన్నారు. ప్రతాప్‌ స్వగ్రామంలో జరిగిన వీరి అంత్యక్రియలకు భారీసంఖ్యలో జనం తరలివచ్చారు. నూరేళ్ల జీవితం కలిసి పంచుకుందామని ఏకమైన కొన్ని గంటలకే ఆకస్మిక మరణానికి గురైన ఆ యువజంటను ఒకే చితిపైకి చేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని