శ్రీకాకుళంలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Updated : 05 Jun 2023 06:28 IST

గార, బూర్జ, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గార, బూర్జ, సారవకోట, కొత్తూరు, మెళియాపుట్టి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సోంపేట, కాశీబుగ్గ, మందస, తదితర మండలాల్లో వర్షం పడింది. బూర్జ మండలం లాభాంలో నక్క పద్మావతి (55) పిడుగుపాటుకు మృతిచెందగా, గార మండలం కొయ్యానపేటకు చెందిన కొయ్యాన చిన్నప్పన్న (48) తన పొలంలో పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని