వీధి కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంటలోని రామాలయం వీధి సమీపంలో వీధి కుక్కల దాడిలో మౌనిక, రవీంద్రరెడ్డిల కుమార్తె బేబి గాయపడింది.

Published : 06 Jun 2023 04:40 IST

గాండ్లపెంట, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంటలోని రామాలయం వీధి సమీపంలో వీధి కుక్కల దాడిలో మౌనిక, రవీంద్రరెడ్డిల కుమార్తె బేబి గాయపడింది. ఇంటి నుంచి వీధిలోకి వచ్చిన బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా కుక్కల దాడిలో బేబితోపాటు మరొకరు గాయపడినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. వీధి కుక్కల సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని