అనాథ చిన్నారులపై పాశవిక దాడి

ఛత్తీస్‌గఢ్‌లో ఓ అనాథ శరణాలయం నిర్వహకురాలు ఇద్దరు చిన్నారుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. వారిని విచక్షణా రహితంగా కొట్టింది.

Published : 06 Jun 2023 04:52 IST

జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టిన నిర్వాహకురాలు

త్తీస్‌గఢ్‌లో ఓ అనాథ శరణాలయం నిర్వహకురాలు ఇద్దరు చిన్నారుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. వారిని విచక్షణా రహితంగా కొట్టింది. ‘శేషకృత్‌ దత్తక్‌ గ్రహణ్‌ ఏజెన్సీ’ అనే అనాథ ఆశ్రమాన్ని సీమా ద్వివేది అనే మహిళ నిర్వహిస్తోంది. ఆమె శనివారం.. ఇద్దరు చిన్నారులపై పాశవికంగా దాడి చేసింది. మొదట ఓ బాలికను తీవ్రంగా కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని నేలకేసి బాదింది. ఆ బాలికను పైకి లేపి మళ్లీ మంచంపైకి విసిరేసింది. ఆ చిన్నారి తనను కొట్టొద్దని ఎంత ఏడ్చి ప్రాధేయపడినా.. నిందితురాలు వినకుండా క్రూరంగా ప్రవర్తించింది. ఈ తర్వాత అక్కడే ఉన్న మరో బాలికను పిలిచి.. ఆ చిన్నారిపై కూడా పాశవికంగా దాడికి దిగింది. ఈ దారుణాన్ని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో పోలీసులు సీమా ద్వివేదీని అరెస్ట్‌ చేశారు. గతేడాది కూడా  సీమా ఇలానే చిన్నారులపై అకృత్యాలకు పాల్పడింది. ఆమెపై మహిశా శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని