పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
ఒడిశా రైలు ప్రమాదం.. ఓ నవ వధువును ఒంటరిదాన్ని చేసింది. బిహార్‌కు చెందిన రూప అనే మహిళ.. ఈ దుర్ఘటనలో తన భర్త అఖిలేశ్ కుమార్ యాదవ్‌ను కోల్పోయింది.
ఒడిశా రైలు ప్రమాదం.. ఓ నవ వధువును ఒంటరిదాన్ని చేసింది. బిహార్‌కు చెందిన రూప అనే మహిళ.. ఈ దుర్ఘటనలో తన భర్త అఖిలేశ్ కుమార్ యాదవ్‌ను కోల్పోయింది. 22 ఏళ్ల అఖిలేశ్.. బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. మే 7నే.. రూపతో అఖిలేశ్ వివాహం జరిగింది. అనంతరం బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు ఆధార్ కార్డ్ ద్వారా అఖిలేశ్‌ను గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిందిగా వారికి సూచించారు. అఖిలేశ్ మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త మరణంతో రూప గుండెలు పగిలేలా రోదిస్తోంది. అతడి మృతదేహాన్ని ఇంటికి తెచ్చేందుకు కుటుంబసభ్యులు ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన