అయిదేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఏపీలోని   ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో అయిదేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు రాళ్లు, కర్రలతో వాటిని తరమడంతో ప్రాణాలు దక్కాయి.

Published : 07 Jun 2023 04:36 IST

విజయవాడలో ఘటన

విజయవాడ (చిట్టినగర్‌), న్యూస్‌టుడే: ఏపీలోని   ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో అయిదేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు రాళ్లు, కర్రలతో వాటిని తరమడంతో ప్రాణాలు దక్కాయి. నగరంలోని 48వ డివిజన్‌ బ్రహ్మంగారి మఠం వీధిలో కరకట్ల సాయిలక్ష్మి, గోపీకృష్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిలక్ష్మి బయటకు వెళుతుండగా మూడు కుక్కలు వెంబడించాయి. ఆమె కేకలు వేయడంతో అవి పక్కకు వెళ్లాయి. ఇంతలో ఆమె అయిదేళ్ల కుమార్తె మేఘన బయటకు రావడంతో అక్కడే ఉన్న కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. చిన్నారి గట్టిగా అరుస్తుండటంతో చుటుపక్కల జనం కర్రలు, రాళ్లతో కుక్కలను తరిమేశారు. తొడ, మోకాళ్ల వద్ద గాయాలు కావడంతో బాలికను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. సమయానికి స్థానికులు రాకపోయి ఉంటే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడేది కాదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వీధి కుక్కల గురించి పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చినా ఎవరు పట్టించుకోలేదని కార్పొరేటర్‌ ఆదిలక్ష్మి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని