కిషన్‌రెడ్డి సంతకం ఫోర్జరీతో ఉద్యోగ నియామక పత్రం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రం (అపాయింట్‌మెంట్‌ లెటర్‌) జారీచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Published : 08 Jun 2023 03:59 IST

నకిలీ పత్రం సృష్టించినవారిపై దిల్లీలో కేసు

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రం (అపాయింట్‌మెంట్‌ లెటర్‌) జారీచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎం.ప్రియమాధురి అనే మహిళను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఓఎస్‌డీగా నియమించుకున్నామని, వెంటనే ఆ నియామకం, జీతభత్యాలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లేఖ రాసినట్లు ఓ నకిలీ పత్రం సృష్టించారు. కిషన్‌రెడ్డి లెటర్‌హెడ్‌పై ఆయన సంతకం ఉన్న ఈ లేఖను తీసుకొని ఆ మహిళ ఉద్యోగంలోకి చేరడానికి వచ్చినప్పుడు ఈ మోసం బయటపడింది. దీనిపై మంత్రి ఏపీఎస్‌ ప్రణవ్‌మహాజన్‌ ఏప్రిల్‌ 27న ఇక్కడి పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నకిలీ పత్రం సృష్టించిన వారిపై కేసు నమోదైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని