గాలులకు కదిలిన గూడ్స్‌ బోగీలు.. ఆరుగురి మృతి

ఒడిశాలో బుధవారం మరో రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్‌లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Updated : 08 Jun 2023 06:29 IST

ఒడిశాలో మరో ప్రమాదం

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో బుధవారం మరో రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్‌లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జాజ్‌పూర్‌ రైల్వేస్టేషన్లో మరమ్మతు పనులు చేస్తున్న ఏడుగురు కార్మికులు వర్షం నుంచి రక్షణ కోసమని సేఫ్టీలైన్‌లో కొంతకాలంగా నిలిపి ఉంచిన ఇంజిన్‌ లేని గూడ్స్‌ బోగీల కిందకు చేరారు. గాలుల తీవ్రతకు ఇవి ముందుకు కదలడంతో వాటి కింద ఉన్నవారు బయటకు రాలేక చక్రాల కింద నలిగిపోయారు. గమనించిన స్థానిక యువకులు వారిని బయటికి తీశారు. ఘటనాస్థలంలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని