బధిర మహిళపై అత్యాచారయత్నం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో బధిర మహిళపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం కందుకూరు వచ్చారు.

Published : 08 Jun 2023 04:36 IST

దిశయాప్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు
సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు

కందుకూరు పట్టణం, నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో బధిర మహిళపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం కందుకూరు వచ్చారు. బస్టాండ్‌ నుంచి రాత్రి కొండముడుసుపాలెం వైపు నడుచుకుంటూ వెళుతుండగా.. పెట్రోల్‌ బంక్‌ సమీపాన ముగ్గురు వ్యక్తులు ఊరికి తీసుకెళతామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. తర్వాత రోడ్డు పక్కకు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా అరవడంతో సమీపంలోనే ఉన్న పెట్రోల్‌ బంకు సిబ్బంది దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దగ్గర్లోనే ఉన్న గస్తీ పోలీసులు బంకు సిబ్బందితో కలసి వెళ్లి ఆమెను రక్షించారు. పారిపోయిన నిందితులను పట్టుకున్నారు. వారిలో ఇద్దరు నేపాల్‌ నుంచి వచ్చి పట్టణంలో గూర్ఖాలుగా పనిచేస్తున్న కరణ్‌, జోషి కాగా మరొకర్ని పట్టణంలో ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ఫిరోజ్‌గా గుర్తించినట్లు డీఎస్పీ ఎ.రామచంద్ర వెల్లడించారు. ఆయన సీఐతో కలసి బుధవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులపై ఎట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితురాలిని ఇంటికి చేర్చామని తెలిపారు. దిశ యాప్‌ ద్వారా మహిళను సకాలంలో రక్షించినట్లు ఎస్పీ కె.తిరుమలేశ్వరరెడ్డి నెల్లూరులో విలేకర్లకు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని