Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య

పచ్చని కుటుంబంలో  మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది. 24 గంటల్లో భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది. వారి పిల్లలను అనాథలుగా మార్చింది.

Updated : 08 Jun 2023 07:12 IST

అనాథలైన ఇద్దరు పిల్లలు

అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: పచ్చని కుటుంబంలో  మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది. 24 గంటల్లో భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది. వారి పిల్లలను అనాథలుగా మార్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామానికి చెందిన కోలా అఖిల (21), వెంకటేశ్వరరావు (28)లది నిరుపేద కుటుంబం. వారికి ఇద్దరు కుమారులు. భార్య వ్యవసాయ కూలీగా, భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో కొంతకాలంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు భరించలేక అఖిల మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చూసిన ఆమె భర్త వెంకటేశ్వరరావు అదే రోజు పురుగుల మందు తాగగా కుటుంబీకులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.  తల్లిదండ్రుల ఆత్మహత్యతో చిన్నారులు నరేంద్రబాబు(3), అక్షిత్‌కుమార్‌(1) అనాథలుగా మారారు. తండ్రి మృతదేహాన్ని వారు దీనంగా చూస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని