Crime News: ప్రియుడి మర్మాంగం కోసిన యువతి

బిహార్‌లోని పట్నాలో ఓ యువతి తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తనను రహస్య వివాహం చేసుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి ఈ దుశ్చర్యకు పాల్పడింది.

Updated : 09 Jun 2023 08:16 IST

బిహార్‌లోని పట్నాలో ఓ యువతి తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తనను రహస్య వివాహం చేసుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. బాధితుడు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తన ప్రేమికుడికి ఈ నెల 23న మళ్లీ పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. ప్రియుడిని పట్నాలోని ఓ హోటల్‌కు రప్పించింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు