బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి

మధ్యప్రదేశ్‌ సీహోర్‌ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది.

Published : 09 Jun 2023 03:46 IST

రెండ్రోజులు శ్రమించినా దక్కని ప్రాణాలు

మధ్యప్రదేశ్‌ సీహోర్‌ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది. మంగళవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన చిన్నారిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, సైనిక సిబ్బంది, రోబోటిక్‌ నిపుణులు, పోలీసులు పొక్లెయిన్లతో దాదాపు 52 గంటలపాటు శ్రమించి గురువారం సాయంత్రం బయటకు తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాధితురాలు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తొలుత 40 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారి సహాయక చర్యల ప్రకంపనలకు మరింత కిందకు జారి 100 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత 140 అడుగుల లోతుకు జారిపోయింది. దీంతో పాపను వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని