రూ.2.11 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

వరంగల్‌లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2.11 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు, రూ.21 లక్షల నగదు, ప్యాకింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 09 Jun 2023 05:16 IST

వరంగల్‌లో రెండు ముఠాల అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2.11 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు, రూ.21 లక్షల నగదు, ప్యాకింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. ఆయా ముఠాల్లోని.. కర్నూలు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాసరావు, కాల్వ శ్రీధర్‌, తాప్తే హనుమంత్‌, బాపట్లకు చెందిన సుందర్‌శెట్టి ఫణిందర్‌, హైదరాబాద్‌కు చెందిన చేడాం పాండు, చేడాం వెంకటరమణ, వేముల అరవింద్‌, మంచిర్యాలకు చెందిన కొప్పుల రాజేశ్‌, బోగి సత్యం, షేక్‌ అమ్జద్‌, ఇందుర్తి వెంకటేశ్‌, పట్టు రాజేశం, మహబూబ్‌నగర్‌కు చెందిన చేడాం నాగరాజు, మహారాష్ట్ర చంద్రపూర్‌కు చెందిన వడిచర్ల సురేందర్‌రెడ్డి, బల్లార్షకు చెందిన దిలీప్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు