Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు. ఈ హత్య వెనుక మృతురాలి మైనర్ కుమార్తె పాత్ర కూడా ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆగ్రాలోని భావనా అరోమా హౌసింగ్ సొసైటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఫుట్‌వేర్ వ్యాపారి అయిన ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. బుధవారం రాత్రి నుంచి తన భార్య అంజలి కనిపించడం లేదని ఉదిత్.. సికంద్ర పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశాడు. అంజలి సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లి తిరిగిరాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి మృతదేహాన్ని గుర్తించారు.
ఇదీ జరిగింది..: తల్లిని మహాదేవ్ ఆలయానికి రప్పించిన కుమార్తె.. ఆమెకు తోడుగా వచ్చిన తండ్రికి తెలివిగా ఫోను చేసి మరోచోటుకు వెళ్లేలా చేసింది. కాసేపటికి తిరిగి వచ్చిన ఉదిత్‌కు అక్కడ భార్య కనిపించలేదు. వయసులో పెద్దవాడైన ప్రాకర్ గుప్తాతో తమ కుమార్తె ప్రేమను అంజలి అంగీకరించలేదు. ఈ కారణంగా ప్రేయసి తల్లిపై కోపం పెంచుకున్న ప్రాకర్ ఆమెను హత్య చేశాడు. ఇందులో అంజలి కుమార్తె, ప్రాకర్ స్నేహితుడి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ