అక్రమ బొగ్గుగని కూలి ఝార్ఖండ్‌లో ముగ్గురి మృతి
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్)లోని భౌరా కాలరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో తవ్వకాలు జరుగుతుండగా గని ఒక్కసారిగా కుప్పకూలింది.
ధన్‌బాద్: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్)లోని భౌరా కాలరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో తవ్వకాలు జరుగుతుండగా గని ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మృతిచెందారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. గనిలో అక్రమ తవ్వకాల పనుల్లో స్థానిక గ్రామస్థులు అనేకమంది పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.