మావోయిస్టుల కుట్ర భగ్నం
పోలీసు బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఎల్‌ఓఎస్ దళ కమాండర్ అరెస్టు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మిలీషియా సభ్యులతో కలిసి చర్ల మండలానికి మావోయిస్టు దళం వస్తోందన్న సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు తాలిపేరు జలాశయం వద్ద శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టాయి. అక్కడ పామేడు ఎల్‌ఓఎస్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద స్టీల్ క్యాన్, అయిదు జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్, నాలుగు బ్యాటరీలు, 50 మీటర్ల కార్డెక్స్ వైరు, 30 మీటర్ల ఎలక్ట్రిక్ తీగ స్వాధీనం చేసుకున్నారు. కమల ఇతర మావోయిస్టు దళం, మిలీషియా సభ్యులతో కలిసి జలాశయం ప్రాంతానికి వచ్చారు. ఆమె పట్టుబడగా మిగతా వారు పరారయ్యారు. కమల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా వాసి. 2015 నుంచి పామేడు ఏరియా ఎల్‌ఓఎస్ కమాండర్‌గా పనిచేస్తోంది. ఆమెపై చర్ల, దుమ్ముగూడెం, పామేడు, కిష్టారం, ఉసూర్ ఠాణాల పరిధిలో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.