టీఎస్‌పీఎస్సీ లీకేజీ ఒప్పందం రూ.1.63కోట్లు

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు సిట్‌ గుర్తించింది. ఈ మేరకు కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రంలో వివరాలు వెల్లడించింది.

Published : 10 Jun 2023 04:00 IST

49 మంది అరెస్టు.. వీరిలో 16 మంది మధ్యవర్తులు
ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసిన సిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు సిట్‌ గుర్తించింది. ఈ మేరకు కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రంలో వివరాలు వెల్లడించింది. గ్రూప్‌-1, డీఏవో, ఏఈఈ, ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించామంది. ఇప్పటివరకు 49 మందిని అరెస్టు చేయగా.. వీరిలో 16 మంది మధ్యవర్తులున్నట్లు ప్రకటించింది. విదేశాల్లో ఉన్న ఒకరిని ఇంకా అరెస్టు చేయలేదని, ఇంకా పెద్దఎత్తున నిందితులను గుర్తించాల్సి ఉందని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పి.ప్రవీణ్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ అట్ల రాజశేఖర్‌తో కలిసి పథకం ప్రకారం కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని కంప్యూటర్‌ నుంచి ప్రశ్నపత్రాల్ని పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేశారని వెల్లడించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాల్ని రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపినట్లు సిట్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.

ఎవరెవరు కొన్నారంటే..

* ఏఈఈ ప్రశ్నపత్రాన్ని ఆది సాయిబాబు(ఏ-25), పి.వరుణ్‌కుమార్‌(ఏ-26), జి.క్రాంతికుమార్‌రెడ్డి(ఏ-30), అజ్మీరా పృథ్వీరాజ్‌(ఏ-36), భూక్యామహేశ్‌(ఏ-47), ముదావత్‌ ప్రశాంత్‌ (ఏ-48), వాదిత్య రమేశ్‌(ఏ-49) కొన్నారు.

* ఏఈ ప్రశ్నపత్రాన్ని 13 మంది కొన్నారు. వారిలో కేతావత్‌ నీలేశ్‌నాయక్‌(ఏ-6), పత్లావత్‌ గోపాల్‌నాయక్‌(ఏ-7), అల్లీపూర్‌ ప్రశాంత్‌రెడ్డి(ఏ-13), తెన్నేటి రాజేంద్రకుమార్‌(ఏ-14), కోస్గి వెంకట జనార్దన్‌(ఏ-19), కోస్గి రవికుమార్‌(ఏ-21), రమావత్‌ మహేశ్‌(ఏ-27), ముదావత్‌ శివకుమార్‌(ఏ-28), జాదవ్‌ రాజేశ్వర్‌(ఏ-37), ధనావత్‌ భరత్‌నాయక్‌(ఏ-41), పి.రోహిత్‌కుమార్‌(ఏ-42),జి.సాయిమధు(ఏ-43), లోకిని సతీష్‌కుమార్‌(ఏ-44) ఉన్నారు.

* డీఏవో ప్రశ్నపత్రాన్ని ఏడునూతల సాయిసుష్మిత(ఏ-18), ధనంనేని రవితేజ(ఏ-29), గంభీరం పురంధర్‌ నూతన్‌ రాహుల్‌కుమార్‌(ఏ-32), అట్ల సుచరిత(ఏ-33), లావడ్యా శాంతి(ఏ-34), రాయపురం విక్రమ్‌(ఏ-39), రాయపురం దివ్య(ఏ-40), బొడ్డుపల్లి నర్సింగ్‌రావు(ఏ-45) కొనుగోలు చేశారు.

* నిందితుల జాబితాలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు పి. ప్రవీణ్‌కుమార్‌(ఏ-1), అట్ల రాజశేఖర్‌(ఏ-2), షమీమ్‌(ఏ-10), దామెర రమేశ్‌కుమార్‌(ఏ-12) ఉన్నారు. వీరిలో ప్రవీణ్‌, షమీమ్‌, రమేశ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాశారు. అలాగే టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి నలగొప్పుల సురేశ్‌(ఏ-11) కూడా రాశాడు.

* ముగ్గురు అభ్యర్థులు ఏఈఈ పరీక్షలో హైటెక్‌విధానంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.

మధ్యవర్తులు ఎవరంటే..

రేణుకారాథోడ్‌(ఏ-3), లావడ్యావత్‌ డాక్యా(ఏ-4), కేతావత్‌ రాజశేఖర్‌(ఏ-5), కేతావత్‌ శ్రీనివాస్‌(ఏ-8), కేతావత్‌ రాజేంద్రనాయక్‌(ఏ-9), డి.తిరుపతయ్య(ఏ-15), వై.సాయిలౌకిక్‌(ఏ-17), కోస్గి మైబయ్య(ఏ-20), కోస్గి భగవత్‌కుమార్‌(ఏ-22), కొంతం మురళీధర్‌రెడ్డి(ఏ-23), ఆకుల మనోజ్‌కుమార్‌(ఏ-24), కొంతం శశిధర్‌రెడ్డి(ఏ-31), రమావత్‌ దత్తు(ఏ-35), పూల రవికిశోర్‌(ఏ-38), గుగులోత్‌ శ్రీనునాయక్‌(ఏ-46), పూల రమేశ్‌(ఏ-50).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని