Crime News: గుర్రాల ఇంజెక్షన్ ఇచ్చి అమ్మాయిని బంధించి.. ఆపై వీడియో తీసి!
శునకాలకు, గుర్రాలకు వాడే ఇంజెక్షన్ ఇచ్చి ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
శునకాలకు, గుర్రాలకు వాడే ఇంజెక్షన్ ఇచ్చి ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో వెలుగుచూసింది. ఫజల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ షోరూమ్‌లో బాధితురాలు పనిచేస్తోంది. కిద్వాయ్ నగర్‌కు చెందిన అర్జున్ సింగ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఓ సారి కలుద్దామని ఆమెను పిలిచిన నిందితుడు అనంతరం ఆమెకు కుక్కలు, గుర్రాలకు చేసే ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను నాలుగు రోజుల పాటు బంధీగా ఉంచి.. పలుమార్లు ఘాతుకానికి తెగబడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి.. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం కొద్ది రోజులకు ఫోన్ చేసి తన వద్దకు రావాలని.. లేకుంటే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు.. ఫజల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా జూన్ 6న మళ్లీ బాధితురాలికి వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ దాడికి పాల్పడతానని నిందితుడు బెదిరించాడు. దీనిపై బాలిక తరఫు న్యాయవాది.. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్