దిల్లీ పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
పశ్చిమ దిల్లీలోని వైశాలి కాలనీలో ఉన్న పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగ్గా.వెంటనే తేరుకున్న సిబ్బంది 20 మంది నవజాత శిశువులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు.
20 మంది నవజాత శిశువుల తరలింపు
దిల్లీ: పశ్చిమ దిల్లీలోని వైశాలి కాలనీలో ఉన్న పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగ్గా.వెంటనే తేరుకున్న సిబ్బంది 20 మంది నవజాత శిశువులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు. నెస్ట్ న్యూబార్న్ అండ్ ఛైల్డ్ ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం తప్పిందని డీసీపీ (ద్వారక) ఎం.హర్షవర్ధన్ తెలిపారు. అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు చెలరేగిన మంటలను తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు గంటసేపు శ్రమించి అదుపు చేశాయి. ఆసుపత్రి భవనం అడుగు భాగంలో పాత ఫర్నీచరు, పేపర్లు నిల్వ చేశారని, అక్కడే మంట మొదలై మూడు ఫ్లోర్లకు వ్యాపించినట్లు దిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మొదటి ఫ్లోరులో ఉన్న ఆసుపత్రికి అగ్నిమాపకశాఖ జారీ చేసిన ఎన్‌వోసీ లేదన్నారు.
పామును చంపి, కాల్చినందుకు కేసు
బదాయూ (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లా బిసౌలి పోలీస్‌స్టేషను పరిధిలో జొహైబ్ అనే యువకుడు ఓ పామును చంపి, మంటల్లో దాన్ని కాల్చినందుకు అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురువారానికల్లా వైరల్‌గా మారింది. అటవీశాఖ అధికారి కృష్ణకుమార్ యాదవ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
మైనర్‌పై ఆరుగురు సామూహిక అత్యాచారం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్‌పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. బాధితురాలిని బెదిరించారు. దాదాపు ఆరు నెలల పాటు.. ఆమెను రాత్రి వేళల్లో పిలుస్తూ వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం