Crime News: పొట్టిగా ఉన్నందున పెళ్లి కావట్లేదని ఆత్మహత్య

ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికి మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయన్న బెంగతో ఝార్ఖండ్‌లోని రాంచీ సమీప పుండగ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో శ్వేత (22) అనే యువతి ఆత్మహత్య చేసుకొంది.

Updated : 10 Jun 2023 07:54 IST

ఈటీవీ భారత్‌: ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికి మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయన్న బెంగతో ఝార్ఖండ్‌లోని రాంచీ సమీప పుండగ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో శ్వేత (22) అనే యువతి ఆత్మహత్య చేసుకొంది. మూడు సందర్భాల్లోనూ చివరిదాకా వచ్చి, కేవలం తాను పొట్టిగా ఉన్న కారణంగా సంబంధాలు వెనక్కు వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబసభ్యులు ఎంతగా నచ్చజెప్పినా ఆ బాధలో నుంచి శ్వేత కోలుకోలేకపోయింది. తల్లిదండ్రులు బిహార్‌లోని అరవల్‌లో ఉంటారు. అక్క శిల్పతో కలిసి శ్వేత ఇక్కడ ఉంటోంది. కుటుంబ పని మీద గురువారం రాత్రి తాను బయటకు వెళ్లానని, పొరుగింటి వ్యక్తులు ఫోను చేసి శ్వేత ఆత్మహత్య గురించి చెప్పినట్లు శిల్ప తెలిపింది. పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని