అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారు.. తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు
తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కట్నం కోసం వేధిస్తున్నారు
ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం
ఈటీవీ భారత్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశించింది. గృహహింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఐఏఎస్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. సందీప్ కుమార్ స్వస్థలం బిహార్‌లోని దర్భంగా జిల్లా. ఆయనకు 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. రూ.కోటికి పైగా ఖర్చుచేసి పెళ్లి జరిపించినా..పెద్దఎత్తున బంగారం, ఆభరణాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. పెళ్లికి ముందు, తర్వాత కట్నం కోసం ఆయన హింసించారన్నారు. సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్‌మెరైన్ తయారీ..!