లండన్‌లో ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత శిఖరాలకు చేరాలనే ఆశతో విదేశాలకు వెళ్లాడు ఆ యువకుడు. కానీ రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది.

Updated : 27 Jul 2023 06:49 IST

చేబ్రోలు, పొన్నూరు, న్యూస్‌టుడే: ఉన్నత శిఖరాలకు చేరాలనే ఆశతో విదేశాలకు వెళ్లాడు ఆ యువకుడు. కానీ రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. ఆ కుటుంబంలో పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్‌ తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు కిరణ్‌కుమార్‌(25) ఏలూరులో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. రెండున్నరేళ్ల కిందట లండన్‌  వెళ్లి ఎంఎస్‌ పూర్తిచేశారు. ఉద్యోగం సంపాదించడానికి నిపుణుల సూచన మేరకు కొన్ని  కోర్సుల్లో ప్రావీణ్యం కోసం శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. జూన్‌ 26న ద్విచక్రవాహనంపై తరగతికి హాజరవడానికి వెళ్తున్నారు. అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్‌ను ఢీకొట్టాడు.  తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబసభ్యులు ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్‌  మృతదేహాన్ని లండన్‌ నుంచి స్వదేశానికి   విమానంలో తరలిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు