ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల దౌర్జన్యం

ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒకరిని కొట్టి గాయపరిచారు. బాధితుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం అచ్చయ్యపాలెంలో పీతా పోసియ్య నాటుసారా తయారు చేసి, విక్రయిస్తున్నారని కోరుకొండకు చెందిన ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు శనివారం ఆయన ఇంట్లోకి వెళ్లారు.

Published : 24 Sep 2023 04:07 IST

సారా తయారు చేస్తున్నారని దాడి

సీతానగరం, న్యూస్‌టుడే: ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒకరిని కొట్టి గాయపరిచారు. బాధితుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం అచ్చయ్యపాలెంలో పీతా పోసియ్య నాటుసారా తయారు చేసి, విక్రయిస్తున్నారని కోరుకొండకు చెందిన ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు శనివారం ఆయన ఇంట్లోకి వెళ్లారు. భోజనం చేస్తున్న పోసియ్యను వెంట రావాలని డిమాండు చేశారు. సారా బట్టీలతో సంబంధం లేదంటున్నా.. కర్రలతో విపరీతంగా కొట్టారు. దీంతో బాధితుడి కుడి కన్ను కింద గాయమైంది. అడ్డుకోబోయిన స్థానికులపైనా కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించారని బాధితుడి భార్య తెలిపారు. మత్తులో ఉన్న పోసియ్య విచారణకు వెళ్లి సిబ్బందితో ఘర్షణకు దిగడంతో ఓ కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డారని కోరుకొండ ఎస్‌ఈబీ సీఐ సత్యనారాయణ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు