విస్తార వర్షాలతో ముగ్గురి మృతి

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ మండలంలో శనివారం వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.

Published : 24 Sep 2023 04:28 IST

పిడుగుపాటుతో ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి ఒకరి దుర్మరణం
ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం

ఈనాడు, హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ మండలంలో శనివారం వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఆసిఫాబాద్‌ పంచాయతీ పరిధిలోని హీరాపూర్‌కు చెందిన తల్లీకూతుళ్లు లక్ష్మీబాయి, చంద్రకళ(24) శనివారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా వారిద్దరిపై పిడుగు పడింది. చంద్రకళ అక్కడికక్కడే మృతిచెందగా.., లక్ష్మీబాయి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిర్రకుంట పంచాయతీ పరిధిలోని గుట్టచెలిమకు చెందిన యువకుడు దేవురావు(24) చేను పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగొస్తుండగా పిడుగుపడి మృతిచెందారు. ఇదే పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్టకు చెందిన భీమ్‌బాయి(55) గ్రామ సమీపంలో వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్క గ్రామంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు 

ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో శనివారం 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ 5.6, మంచిర్యాల జిల్లా మందమర్రి 4.3, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి 3.8, నిర్మల్‌ జిల్లా మామ్డ 3.7, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి 3, కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలో 2.9 సెం.మీటర్లు కురిసింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కొనసాగే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని