విమానాశ్రయంలో 1.6 కిలోల బంగారం పట్టివేత

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.633 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు శనివారం పట్టుకున్నారు.

Updated : 08 Nov 2023 14:31 IST

ముగ్గురు ప్రయాణికుల అరెస్ట్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.633 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు శనివారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు రస్‌ అల్‌ ఖైమా నుంచి స్వదేశానికి బయల్దేరారు. ఈ క్రమంలో 1.633 కిలోల బరువున్న 14 బంగారం బిస్కెట్లను తమ సామగ్రిలో రహస్యంగా పెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ఆ ప్రయాణికుల ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని, వారి సామగ్రిని తనిఖీ చేయగా అక్రమ బంగారం తరలింపు బయటపడింది. రూ.99.57 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని