హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

గుజరాత్‌లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్‌ మధ్య ఈ రైలు నడుస్తోంది.

Published : 24 Sep 2023 05:53 IST

వల్సాడ్‌: గుజరాత్‌లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్‌ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇది వల్సాడ్‌ స్టేషన్‌ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలుకు చెందిన బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు.  ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని