పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్‌ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం

చంద్రబాబు పుంగనూరు పర్యటనలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో తన కుమారుడికి బెయిల్‌ రాలేదని, మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు.

Published : 26 Sep 2023 08:32 IST

సోమల, న్యూస్‌టుడే: చంద్రబాబు పుంగనూరు పర్యటనలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో తన కుమారుడికి బెయిల్‌ రాలేదని, మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచి శ్రీనివాసులునాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో 50 మందికి ఆదివారం బెయిలొచ్చింది. శ్రీనివాసులు నాయుడుకు బెయిల్‌ రాలేదని ఆయన తల్లి రాజమ్మ గుర్తు తెలియని ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను కుటుంబసభ్యులు 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని