మద్యానికి బానిసైన కుమారుడికి తల్లిదండ్రుల మరణశాసనం
కొడుకు మద్యానికి బానిసై, కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా తన జల్సాలకు ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించాడు.
హంతకులకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి మరీ మట్టుబెట్టిన దారుణం
ఎటపాక, న్యూస్‌టుడే: కొడుకు మద్యానికి బానిసై, కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా తన జల్సాలకు ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించాడు. దీంతో ఆ కన్నవారి గుండె మండిపోయింది. కుమారుడు ఇక దారికి రాడనుకుని మనసు చంపుకొని ఊపిరి తీయాలనుకున్నారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. మత్తుకు బానిసైన వ్యక్తి.. కుటుంబం కకావికలం కావడానికి ఎలా కారకుడవుతాడనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఈ నెల 10న హత్య జరిగింది. సోమవారం ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ కె.వి.మహేశ్వరరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము (57), సావిత్రి (55)ల కుమారుడు దుర్గాప్రసాద్ (35). రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయి భార్య మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా అతడు తన తీరు మార్చుకోకుండా ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను హింసించేవాడు. కొడుకు పెడుతున్న బాధలు చాలా రోజుల పాటు తట్టుకున్న వారిలో చివరకు సహనం నశించింది. కొడుకును అంత మొందించేందుకు భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు (33), షేక్ ఆలీ పాషా (32)లకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.
పథకం ప్రకారం ఈ నెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను సుపారీ వ్యక్తులు, తల్లిదండ్రులు కలిసి కత్తితో మెడ కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుమ్మలనగర్ అటవీ ప్రాంతానికి ఆటోలో తీసుకొచ్చి గానుగచెట్ల తోటలో పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆ తరవాత నలుగురూ ఊరొదిలి పరారయ్యారు. 10వ తేదీ మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించింది. దర్యాప్తు ప్రారంభించిన ఎటపాక పోలీసులు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో మృతదేహం ఫొటోతో కరపత్రాలు వేశారు. తెలంగాణలో ఉంటున్న మృతుని భార్య ఆ ఫొటో తన భర్తదేనని గుర్తుపట్టి పోలీసులను ఆశ్రయించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. అతడి తల్లిదండ్రులు, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరులోని జోస్ ఆలుక్కాస్ గోల్డ్ షాప్‌లో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. -
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
Crime News: మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి కన్న కుమార్తెలను ఘోరమైన మనో వేదనకు గురిచేసింది. ఆమె చర్యలను తీవ్రంగా ఖండించిన కోర్టు.. 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
వృత్తలేఖినితో 108 సార్లు పొడిచారు
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. చిన్న ఘర్షణ కారణంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖిని(జామెట్రీ కంపాస్)తో 108 సార్లు పొడిచారు. -
ఎలుగుబంటి దాడిలో విశాఖ జూ ఉద్యోగి మృతి
విశాఖ జంతు ప్రదర్శనశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో దాన్ని సంరక్షించే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆటో, ఇసుక లారీ ఢీ.. తండ్రీ కుమారుల దుర్మరణం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేటస్జేజీ వద్ద సోమవారం రాత్రి ఆటోను ఇసుక లారీ ఢీకొనడంతో తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఏపీలో.. బాలికల వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఈసీ)లో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగట్ల రేచల్రెడ్డి (19) ఆత్మహత్యకు పాల్పడింది. -
యూపీలో యువకుడిపై మూత్రం.. నలుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఒక యువకుడిని తీవ్రంగా కొట్టి మూత్రం పోసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
-
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
-
Zuckerberg: రోజుకు 4వేల కేలరీల ఆహారం తీసుకుంటా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జుకర్‌బర్గ్
-
Uttarakhand Tunnel: సొరంగం వద్ద డ్రిల్లింగ్ పూర్తి.. కాసేపట్లో కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి