Chittoor: కళ్లు పీకి.. జుట్టు కత్తిరించి... యువతి దారుణ హత్య!
ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
అంతకుముందు అత్యాచారం!
ముగ్గురు యువకుల ప్రమేయం
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
పోలీసులు సకాలంలో స్పందిస్తే తమ కుమార్తె బతికేదని ఆరోపణ
పెనుమూరు, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై చిత్తూరు జిల్లాలో ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. తమ కుమార్తె ఇంటర్ విద్యార్థిని. ఈనెల 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమపేరుతో వేధించేవారు. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అనంతరం అత్యాచారం చేసి, చంపేసి, కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారు. వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది.
ఆభరణాలను చూసి ఆ తల్లిదండ్రులు... తమ కుమార్తెను గుర్తించారు. ఆమె అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేదని వారు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. మృతురాలి తలపై జుట్టు ఏమైందని తల్లిదండ్రులు... ఎస్సై అనిల్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఆయన సోమవారం బావిలోని నీటిని మోటారు ద్వారా తోడించగా జట్టు లభించింది. విద్యార్థిని మృతి విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి ఫోన్లలో కాల్‌డేటాను పరిశీలించామని అనుమానాస్పదంగా ఏమీ లేదని చెప్పారు. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
కాల్పులకు తెగబడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. హరియాణాలో ఈ ఘటన ఇది వెలుగుచూసింది. -
Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. తమిళనాడులోని వైద్యుల సాయంతో ఈ ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది. -
Girl Kidnap: బాలిక కిడ్నాప్.. రూ.10 లక్షల డిమాండ్
ఆరేళ్ల బాలిక కిడ్నాప్ అంశం సుఖాంతమైంది. పోలీసుల విస్త్రృత తనిఖీలు చేయడంతో భయపడిన కిడ్నాపర్లు ఆమెను ఓ గ్రౌండ్లో వదిలేసి పరారయ్యారు. -
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరులోని జోస్ ఆలుక్కాస్ గోల్డ్ షాప్‌లో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. -
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
Crime News: మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి కన్న కుమార్తెలను ఘోరమైన మనో వేదనకు గురిచేసింది. ఆమె చర్యలను తీవ్రంగా ఖండించిన కోర్టు.. 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
వృత్తలేఖినితో 108 సార్లు పొడిచారు
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. చిన్న ఘర్షణ కారణంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖిని(జామెట్రీ కంపాస్)తో 108 సార్లు పొడిచారు. -
ఎలుగుబంటి దాడిలో విశాఖ జూ ఉద్యోగి మృతి
విశాఖ జంతు ప్రదర్శనశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో దాన్ని సంరక్షించే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆటో, ఇసుక లారీ ఢీ.. తండ్రీ కుమారుల దుర్మరణం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేటస్జేజీ వద్ద సోమవారం రాత్రి ఆటోను ఇసుక లారీ ఢీకొనడంతో తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఏపీలో.. బాలికల వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఈసీ)లో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగట్ల రేచల్రెడ్డి (19) ఆత్మహత్యకు పాల్పడింది. -
యూపీలో యువకుడిపై మూత్రం.. నలుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఒక యువకుడిని తీవ్రంగా కొట్టి మూత్రం పోసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Vizag: విశాఖ కాపులుప్పాడలో డేటాసెంటర్కు భూకేటాయింపు.. ఎకరా ₹కోటి
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Digital Fraud: అనుమానాస్పద లావాదేవీలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్
-
Ap High court: కోడికత్తి కేసు.. కౌంటరు దాఖలు చేసిన ఎన్ఐఏ
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు