భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం

భాజపా ఎమ్మెల్యే అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బందిలోని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలితో గొడవ పడి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 26 Sep 2023 06:52 IST

లఖ్‌నవూ: భాజపా ఎమ్మెల్యే అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బందిలోని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలితో గొడవ పడి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం  చోటు చేసుకుంది. భాజపా ఎమ్మెల్యే యోగేశ్‌ శుక్లా మీడియా సెల్‌లో శ్రేష్ఠ తివారీ అనే 24 ఏళ్ల యువకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తివారీ నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. విధుల్లో భాగంగా ఎమ్మెల్యే అధికార నివాసంలో ఉన్నప్పుడు తన ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూ ఉరి వేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రియురాలి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని