స్ట్రాంగ్‌ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..

దిల్లీలోని ఓ నగల దుకాణంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌ గోడకు రంధ్రం చేసి.. లోపలకు చొరబడి రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

Updated : 27 Sep 2023 06:48 IST

రూ.25 కోట్ల విలువైన ఆభరణాలు మాయం

దిల్లీలోని ఓ నగల దుకాణంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌ గోడకు రంధ్రం చేసి.. లోపలకు చొరబడి రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అక్కడి సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. హజ్రత్‌ నిజాముద్దీన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భోగల్‌.. జంగ్‌పురా ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్‌ సింగ్‌ దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం దుకాణాన్ని మూసివేసిన యజమాని సంజీవ్‌ జైన్‌.. మంగళవారం తెరవగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని