ఐసిస్‌ ఉగ్రవాది షానవాజ్‌ అరెస్ట్‌

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీవ్రంగా గాలిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాది మహమ్మద్‌ షానవాజ్‌ అలియాస్‌ షఫీ ఉజామాను, మరో ఇద్దరు అతడి అనుచరులను సోమవారం దిల్లీ పోలీసులు అరెస్టుచేశారు.

Published : 03 Oct 2023 04:47 IST

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీవ్రంగా గాలిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాది మహమ్మద్‌ షానవాజ్‌ అలియాస్‌ షఫీ ఉజామాను, మరో ఇద్దరు అతడి అనుచరులను సోమవారం దిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. షానవాజ్‌ను దేశ రాజధానిలోని జైత్‌పుర్‌లో అరెస్టు చేయగా, అతడి అనుచరులు మొహమ్మద్‌ రిజ్వాన్‌ అష్రాఫ్‌, మొహమ్మద్‌ అర్షద్‌ వార్సీలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, మొరాదాబాద్‌లలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ముగ్గురు ఉగ్రవాదులు ఇంజినీర్లని పోలీసులు తెలిపారు. వారు వారం రోజులపాటు పోలీసు కస్టడీలో ఉండనున్నారు. షానవాజ్‌ పుణెలో పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకొని దిల్లీలో రహస్యంగా ఉంటున్నాడు. అతడిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. మరోవైపు, షానవాజ్‌ నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్‌ గొట్టాలు, ఇనుప గొట్టాలు, వివిధ రకాల రసాయనాలు, టైమింగ్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబుల తయారీకి సంబంధించిన సాహిత్యాన్ని కూడా అతని వద్ద గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని