పేదరికమే పెనుశాపమైన వేళ..

పేదరికం కారణంగా సంతానాన్ని పెంచి పెద్దచేయలేమన్న ఆందోళనతో ఓ దంపతులు తమ ముగ్గురు కుమార్తెలను హత్య చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Published : 03 Oct 2023 02:36 IST

పెంచే స్తోమత లేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తల్లిదండ్రులు
పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఘోరం

చండీగఢ్‌: పేదరికం కారణంగా సంతానాన్ని పెంచి పెద్దచేయలేమన్న ఆందోళనతో ఓ దంపతులు తమ ముగ్గురు కుమార్తెలను హత్య చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలీలైన సుశీల్‌ మండల్‌, అతని భార్య మంజుదేవి కొన్నాళ్ల కిందట జలంధర్‌ జిల్లాలోని కాన్పుర్‌ గ్రామానికి వలస వచ్చారు. పేదరికంలో మగ్గుతున్న వీరు ఆదివారం తమ కుమార్తెలు కాంచన (4), శక్తి (7), అమృత (9)లకు పురుగుల మందు కలిపిన పాలు ఇచ్చారు. వారు మరణించాక మృతదేహాలను ట్రంకుపెట్టెలో ఉంచారు. అనంతరం తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ మక్సుదాన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు వీరిని గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఐదుగురి సంతానంలో ఇద్దరిని మాత్రమే పెంచగలిగే ఆర్థిక స్థోమత తమకు ఉందని, అందుకే ముగ్గురిని హత్య చేశామని సుశీల్‌ మండల్‌, మంజుదేవి అంగీకరించారు. పోలీసులు హత్య కేసు నమోదుచేసి వారిని అరెస్టుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని