పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు

త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్‌శహర్‌కు చెందిన ఓ యువతి, యువకుడు త్వరలో వివాహం చేసుకోనున్నారు.

Updated : 03 Oct 2023 08:26 IST

లఖ్‌నవూ: త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్‌శహర్‌కు చెందిన ఓ యువతి, యువకుడు త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే సరదాగా గడిపేందుకు స్థానిక పార్క్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పోలీసులు వారిని రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జైలుకే అంటూ యువకుడిని బెదిరించారు. తమని వదిలేయమంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని ఆ జంట వేడుకున్నా కనికరించలేదు. యువకుడి నుంచి కొంత డబ్బును బలవంతంగా బదిలీ చేయించుకున్నారు. అవి సరిపోవంటూ రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తరచూ యువతికి ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడడమే కాకుండా యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి కూడా వచ్చేవారు. దీంతో ఆ జంట.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితులను రాకేశ్‌ కుమార్‌, దిగంబర్‌ కుమార్‌గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని