యువకుడి దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్‌ మృతి

వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే ఆపమన్నందుకు గత నెల 30న ఉలాస రామకృష్ణ అనే యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ గంధం నరేంద్ర(34).. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు.

Published : 03 Oct 2023 04:47 IST

ఆగిరిపల్లి, నూజివీడు రూరల్‌, పట్టణం, న్యూస్‌టుడే: వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే ఆపమన్నందుకు గత నెల 30న ఉలాస రామకృష్ణ అనే యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ గంధం నరేంద్ర(34).. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని సోమవారం ఆయన స్వగ్రామం ఎన్టీఆర్‌ జిల్లా  ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు తరలించారు. నరేంద్ర ఎంబీఏ చేసి, 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తొలుత ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో పనిచేశారు. మూడు నెలల కిందట బదిలీపై ఆగిరిపల్లి స్టేషన్‌కు వచ్చారు. ఆగిరిపల్లి మండలం ఈదరకు చెందిన లక్ష్మీప్రియను 2019లో వివాహం చేసుకున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె ఉన్నారు. నరేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీసు శాఖ ఆదుకుంటుందని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. నరేంద్ర మృతదేహాన్ని సందర్శించి వారు నివాళులర్పించారు. నరేంద్ర పిల్లల చదువుల బాధ్యతను పోలీసు శాఖ తీసుకుంటుందని ఈ సందర్భంగా డీఐజీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని