మానవత్వమా.. నువ్వెక్కడ?

ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. వాహన సిబ్బంది కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Published : 03 Oct 2023 04:43 IST

బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు
మార్గమధ్యలో సిబ్బంది దించేసి వెళ్లడంతో మృతి

చెన్నై(ప్యారిస్‌), న్యూస్‌టుడే: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. వాహన సిబ్బంది కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌కి చెందిన జ్యోతిభాస్కర్‌ (50).. శంకరన్‌కోవిల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాజపాళెయం వద్ద జ్యోతిభాస్కర్‌కు గుండెనొప్పి రావడంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌, డ్రైవర్‌కు చెప్పారు. కానీ వారు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శంకరన్‌కోవిల్‌ సమీపంలో కిందికి దించి అక్కడున్న టీ దుకాణం ముందు కూర్చోబెట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. ఉదయాన్నే దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్న జ్యోతిభాస్కర్‌ను చూసి పైకి లేపడానికి యత్నించాడు. చలనం లేకపోవడంతో అంబులెన్స్‌ ద్వారా రాజపాళెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని