ప్రభుత్వ ఉద్యోగం కోసం.. తండ్రిపై కాల్పులు జరిపించిన కుమారుడు

ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రినే హతమార్చాలనుకున్నాడో యువకుడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకొంది. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు.

Updated : 21 Nov 2023 09:25 IST

రాంచీ: ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రినే హతమార్చాలనుకున్నాడో యువకుడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకొంది. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్‌ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని అమిత్‌ ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. ఆ పనికి కొంతమంది కిరాయి హంతకులను వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే బయట వెళ్లిన రామ్‌జీపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా కుమారుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని