లండన్‌లో కోనూరు యువకుడి మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన యువకుడు గుంటుపల్లి సాయిరాం (25) లండన్‌ బీచ్‌లో మృతి చెందాడు.

Published : 11 Jun 2024 06:26 IST

గుంటుపల్లి సాయిరాం (పాతచిత్రం) 

కోనూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన యువకుడు గుంటుపల్లి సాయిరాం (25) లండన్‌ బీచ్‌లో మృతి చెందాడు. బంధువులు, గ్రామస్థుల సమాచారం మేరకు.. లండన్‌లోని లాన్‌షైర్‌ దగ్గరలోని బ్లాక్‌ పూల్‌ బీచ్‌లో ఈనెల 2వ తేదీ రాత్రి మృతి చెందినట్లు పోలీసుశాఖ నుంచి సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. అతని మృతదేహాన్ని లండన్‌లోని బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు సమాచారం. కోనూరుకు చెందిన ఏడుకొండలు, అన్నపూర్ణమ్మ దంపతులకు కిరణ్‌ సాయి, సాయిరాం ఇద్దరు సంతానం. ఏడుకొండలు అయిదేళ్ల కిందట మృతి చెందాడు. సాయిరాం లండన్‌లోని హీట్‌పోర్డు షైన్‌ యూనివర్సిటీలో ఉన్నత చదువుల నిమిత్తం 2021లో వెళ్లాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ప్టోరులో పనిచేస్తున్నాడు. ఈనెల 2న లండన్‌లోని బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం తల్లి అన్నపూర్ణమ్మ తీర్థయాత్రలకు షిర్డీ వెళ్లింది. ప్రభుత్వం స్పందించి యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని బంధువులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు