కుటుంబ కలహాలతో కో-డైరెక్టర్‌ ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్‌రైటర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజ్‌నగర్‌ బస్తీలో చోటుచేసుకుంది.

Updated : 12 Jun 2024 07:09 IST

ఎస్‌.శివ

బోరబండ, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల కారణంగా సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్‌రైటర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజ్‌నగర్‌ బస్తీలో చోటుచేసుకుంది. డీఐ బి.భూపాల్‌గౌడ్, అడ్మిన్‌ ఎస్‌.ఐ. షేక్‌ నాగుల్‌ మీరా, స్థానికులు తెలిపిన ప్రకారం బందరు ప్రాంతానికి చెందిన ఎస్‌.శివ(65) సినిమాలకు కో-డైరెక్టర్,  స్క్రిప్ట్‌రైటర్‌గా పని చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కూతుళ్లకు వివాహాలు కాగా, భార్యతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. చాలాకాలం శ్రీకృష్ణానగర్‌లో నివసించిన ఆయన గత మార్చిలో బోరబండ రాజ్‌నగర్‌ బస్తీలోని హరనాథ్‌ గుప్తా ఇంటిలో అద్దెకు దిగాడు. అతని ఇంట్లో నుంచి తీవ్ర దుర్గంధం వస్తోందని మంగళవారం మధ్యాహ్నం స్థానికులు బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు తెరచి చూడగా.. శివ ఉరి వేసుకొని  కనిపించాడు. అక్కడే ఉన్న అయిదు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. అతడు మృతిచెంది మూడు రోజులై ఉంటుందన్నది పోలీసుల ప్రాథమిక అంచనా. అనారోగ్యం, ఒంటరితనం కారణంగా అత్మహత్య చేసుకొని ఉంటాడని తెలిపారు. బోరబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని