సైబర్‌ నేరగాళ్ల వలలో బ్యాంకు మేనేజర్‌

పట్టణంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ నేరగాళ్లుకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.

Published : 12 Jun 2024 06:36 IST

కందనూలు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ నేరగాళ్లుకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బ్యాంకు మేనేజర్‌ చరవాణికి వారం రోజుల క్రితం మెసేజ్‌ రూపంలో ఒక లింకు వచ్చింది. వెంటనే ఆ లింక్‌ ఓపెన్‌ చేయడంతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ హ్యాక్‌ చేశారు. బాధితుడి చిత్రాన్ని అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు మేనేజర్‌ చరవాణిలో ఉన్న కాంటాక్ట్‌ నంబర్లకు అశ్లీల చిత్రాలు పంపిస్తామని బెదిరించి రూ. 1.56 లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆపకపోవడంతో బాధితుడు పట్టణంలోని సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఆన్‌లైన్‌ ఫిర్యాదు చేయడంతో విచారణ నిర్వహిస్తున్నామని ఎస్సై గోవర్దన్‌ తెలిపారు. 

సైబర్‌ మోసం: రూ.80 వేలు మాయం

ధరూరు : ‘నేను ఏఎస్సైని మాట్లాడుతున్నాను.. ఎస్సై కుమార్తెకి ఆరోగ్యం బాగోలేదు రూ.80 వేలు ఫోన్‌ పే చేయండి. నగదు మా కానిస్టేబుల్‌తో మీ బంక్‌ వద్దకు పంపిస్తున్నాను’ అంటూ ధరూరులోని పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ను బురిడీ కొట్టించి సైబర్‌ మోసగాళ్లు నగదు కాజేశారు. ఎస్సై విజయకుమార్‌ కథనం మేరకు ఈనెల 4న  పెట్రోల్‌ బంక్‌ యజమానికి ఏఎస్‌ఐ అంటూ కాల్‌ వచ్చింది. తాను బంక్‌లో లేనంటూ మేనేజరు గోపీ నంబరు ఇచ్చాడు ఇదంతా మేనేజరుకు చెప్పడంతో నగదు బదిలీ చేశారు..  నాలుగు రోజులవుతున్నా.. నగదు పంపకపోగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన బంక్‌ మేనేజర్‌ తాను మోసపోయినట్లు తెలుసుకొని ధరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని