ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు

కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్‌ ఫెయిలై ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లి ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయింది.

Published : 13 Jun 2024 05:29 IST

వృద్ధురాలికి తీవ్ర గాయాలు

జగ్గంపేట బస్టాండులో ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు

జగ్గంపేట, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్‌ ఫెయిలై ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లి ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయింది. అక్కడి రైలింగ్‌ను ఢీకొని బస్సు నిలిచిపోవడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఏలేశ్వరం డిపోకు చెందిన బస్సు ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో జగ్గంపేట బస్టాండుకు బుధవారం మధ్యాహ్నం చేరుకుంది. బస్టాండులోకి వచ్చేసరికి బస్సు క్లచ్‌ చెడిపోయి బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. రైలింగ్‌ సమీపంలో నిల్చొని ఉన్న సామర్లకోట మండలం గొంచెర్ల గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మోర్త సుబ్బాయమ్మ కాలిపైకి బస్సు చక్రం ఎక్కడంతో తీవ్ర గాయమైంది. వృద్దురాలిని జగ్గంపేట ఆసుపత్రికి, అక్కడినుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు