యూపీలో విషాదం.. ఇసుక ట్రక్కు బోల్తాపడి ఒకే ఇంట్లో 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇసుక ట్రక్కు బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆ ఇసుక కింద సజీవ సమాధి అయ్యారు.

Updated : 13 Jun 2024 06:41 IST

హర్దోయ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇసుక ట్రక్కు బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆ ఇసుక కింద సజీవ సమాధి అయ్యారు. వారంతా ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇసుక కింద ఇరుక్కున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో గాయపడిన ఐదేళ్ల బాలికను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని