పోడు భూమి దక్కదేమోనన్న భయంతో రైతు ఆత్మహత్య

తాను సాగుచేస్తున్న భూమి దక్కదేమోనన్న భయంతో పోడు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల పరిధి బంగారికుంటతండాలో చోటుచేసుకుంది.

Published : 13 Jun 2024 06:24 IST

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: తాను సాగుచేస్తున్న భూమి దక్కదేమోనన్న భయంతో పోడు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల పరిధి బంగారికుంటతండాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్ర కసన(58) మొల్కచర్ల అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా 4 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. పట్టా కోసం గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. ఇదిలా ఉండగా..ఆక్రమణలో ఉన్న అటవీ భూమిలో మొక్కలు నాటనున్నట్లు అటవీశాఖ అధికారులు 4 రోజులుగా హెచ్చరికలు జారీచేస్తూ వస్తున్నారు. అనుకున్నట్టే బుధవారం మొక్కలు నాటేందుకు సిద్ధమై.. సమీప రైతుల సాగులో ఉన్న అటవీ భూముల్లో జేసీబీతో గుంతలు తీయించారు. తన భూమిలోనూ మొక్కలు నాటుతారేమోనని భయపడిన కసన ఆ భూమిలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు అడవిదేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని