బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు

బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Updated : 14 Jun 2024 06:34 IST

ఆరుగురి దుర్మరణం

నాగ్‌పుర్‌: బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నాగ్‌పుర్‌ సమీప ధామ్నా గ్రామ పరిధిలోని ఓ బాణసంచా తయారీ పరిశ్రమలోని ప్యాకింగ్‌ యూనిట్‌లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో అక్కడే పనిచేస్తున్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అయిదుగురు మహిళలు, మరో వ్యక్తి మృతి చెందారు.  

యూపీలో అగ్నిప్రమాదం..  ఐదుగురి సజీవ దహనం

గాజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఉన్న ఓ నివాస భవనంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఓ మహిళతోపాటు చిన్నారిని రక్షించినట్లు పోలీసు అదనపు కమిషనర్‌ అంకుర్‌ విహార్‌ భాస్కర్‌ తెలిపారు. షార్ట్‌  సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు