‘కూలి’న బతుకులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందడం విషాదం నింపింది.

Published : 14 Jun 2024 05:57 IST

పునాది నిర్మిస్తుండగా ప్రమాదం
ముగ్గురు భవన నిర్మాణ కార్మికుల దుర్మరణం 

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందడం విషాదం నింపింది. కుమురం భీం జిల్లాకు చెందిన వలస కూలీలు ఎనంక హన్మంతు(45), గోలెం పోశం(60) మంచిర్యాలలో, ఆత్రం శంకర్‌(42) మందమర్రిలో నివాసముంటున్నారు. వీరు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఈ ముగ్గురితో పాటు మరో కూలీ మైదం రామన్న కలిసి.. ఓ భవనానికి 10 అడుగుల లోతులో పునాది నిర్మాణ పనులు చేపట్టారు. ఆ సమయంలో పక్క భవనం ప్రహరీ పునాది ఒక్కసారిగా కూలి.. వీరిపై పడిపోయింది. ఈ ఘటనలో హన్మంతు, పోశం, శంకర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రామన్నకు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని